హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా

by Dishafeatures2 |
హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా
X

దిశ, నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెండు నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని, చనిపోయిన కార్మికులకు మట్టి ఖర్చులు, ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ దర్గా నుండి ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే. పెంచల నరసయ్య, సిఐటియు నెల్లూరు రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులు దృష్టికి తీసుకు వెళుతున్న ఏ ఒక్క సమస్య పరిష్కారాలు కావడం లేదు. గత రెండు నెలల నుండి హెల్త్ అలవెన్స్ బకాయిలు పెండింగులో ఉన్నాయి. అంతే కాకుండా సబ్బులు, సోపులు, మాస్కులు, గ్లౌజులు, యూనిఫామ్ ఇవ్వాలని అడుగుతున్న గత నాలుగు సంవత్సరాల నుండి వాటి గురించి పట్టించుకోవడం లేదు.

విధి నిర్వహణలో ఉండి చనిపోయిన కార్మికులకు కనీసం మట్టి ఖర్చులు ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వటం లేదు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని వాటిని ఇవ్వడం లేదు. అంతే కాకుండా పిఎఫ్ కు సంబంధించి కార్మికుల ఖాతాలో నుండి డబ్బులు జమ చేసుకుంటున్నా వాటిని పిఎఫ్ ఖాతాలో జమ చేయకపోవడం వలన అవసరాలు కోసం విత్ డ్రా చేసుకునే దానికి ఇబ్బందులు వస్తున్నాయి. నాలుగు మాస్టర్లు విధానాన్ని రద్దు చేస్తామని ఇంతవరకు దాని ఊసే లేదు. గత సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలు అమలు కాలేదు. వారసులుగా పని చేస్తున్న వారికి 11 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. ఈ సమస్యలపై పరిష్కారం చేయాలని అడుగుతున్న కమిషనర్లు మారుతున్నారు తప్ప, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి, నేడు దానిని విస్మరించడం దుర్మార్గం. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామన్నారు.

కానీ ఔట్సోర్సింగ్ లో( ఆప్కాస్) పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల ను పర్మినెంట్ చేస్తామని చెప్పడం లేదు. గతంలో పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని వైసిపి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం ఐదు గంటలకి మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక సమస్యలు పరిష్కరించే దానికి చేస్తామని ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు సుజాతమ్మ, దేశ మూర్తి, సిఐటియు నాయకులు బత్తల కిష్టయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed