సీఎం జగన్‌కు షాక్: అక్రమాస్తుల కేసుపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 21 |
cm ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు షాక్ తగిలింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసు విచారణకు హాజరుకావడం లేదని ఫలితంగా సీబీఐ దర్యాప్తు ఆలస్యం అవుతోందంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసు విచారణను త్వరగా పూర్తి చేసేలా సీబీఐని, సీబీఐ కోర్టును ఆదేశించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్ పై బయట ఉన్నారని పిటిషన్‌లో తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. సీబీఐ, జగన్‌తో పాటు ప్రతివాదులు అందరికీ ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. మరోవైపు ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది.



Next Story

Most Viewed