YS అవినాశ్ రెడ్డితో ఏం ప్రయోజనం లేదు.. షర్మిల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
YS అవినాశ్ రెడ్డితో ఏం ప్రయోజనం లేదు.. షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. గురువారం కడప జిల్లా ముఖ్య నేతలతో షర్మిల సమావేశమయ్యారు. అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సొంతంగా తాను నిర్ణయం తీసుకోను అని.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తానని అన్నారు. కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డితో కడప ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ఏం ప్రయోజనం లేదని విమర్శించారు. ఎంపీగా ఉండి కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.

కాగా, రాబోయే పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దీనిపైనే ఇవాళ కడప జిల్లా నేతల సమావేశంలో కీలకంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన పార్లమెంట్ పరిధిలో బలమైన వ్యక్తులనే ఎమ్మె్ల్యే అభ్యర్థులుగా బరిలోకి దించాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లోనే ఏపీ మొదటి జాబితా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.


Next Story