వైసీపీని వీడుతున్న వారంతా చంద్రబాబు కోవర్టులే.. నారాయణస్వామి

by Disha Web Desk 3 |
వైసీపీని వీడుతున్న వారంతా చంద్రబాబు కోవర్టులే.. నారాయణస్వామి
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ లో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో చాల మంది వైసీపీ నేతలు పార్టీ కి గుడ్ బై చేప్పేసారు. మరికొంత మంది నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా పార్టీని వీడుతున్న నేతల పైన ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ నుండి బయటకు వెళ్తున్న వారంతా తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోవర్టులే అని మండిపడ్డారు. వారంతా మొదటి నుండి చంద్రబాబు తో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. ఒక వైసీపీ లోనే కాదు బీజేపీ, కాంగ్రెస్‌లో కూడా చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్నారని ఆయన పేర్కొన్నారు.

అందుకే వైసీపీ లో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళ వల్ల ఎప్పటికైనా పార్టీకి ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టిందని తెలిపిన ఆయన. అందుకే నమ్మకస్తులకే జగన్ పట్టం కడుతున్నారన్నారని పేర్కొన్నారు. ఎవరిని నమ్మవద్దని తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్ధిస్తున్నానని అన్నారు. ఇక తెలుగుదేశం లో ఉన్న ఎస్సీలకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని.. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న కొంతమంది ఎస్సీలు వైసీపీలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు ఆ అభ్యర్థులను బయటకు రానివ్వకుండా డబ్బులు ఇస్తున్నాడని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగిస్తారని.. అది నిరూపించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీపీడీ నుండి వైసీపీ లోకి వస్తున్నవాళ్లు ఏ పన్నాగాలతో వస్తున్నారో తెలీదని.. కనుక వాళ్ళను పార్టీ లోకి ఆహ్వానించ వద్దని జగన్ కాళ్ళ పైన పడి వేసుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడుని షర్మిల కలవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక వై.ఎస్ మరణానికి సోనియాగాంధీ, చంద్రబాబు కారణం అని గతంలో తానన్న వ్యాఖ్యలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నానని .. తానే కాదు ప్రజలంతా అదే మాట పైన ఉన్నారని.. మరి అందరి పైన చంద్రబాబు కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed