Breaking:వలంటీర్ల రాజీనామాలు..హైకోర్టు కీలక ఆదేశాలు

by Disha Web Desk 18 |
Breaking:వలంటీర్ల రాజీనామాలు..హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ వలంటీర్ల రాజీనామా ఏపీ రాజకీయల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వలంటీర్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. వలంటీర్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాల్గొనకూడదని ఈసీ కోరడంతోనే వారు రాజీనామా చేస్తున్నారన్న పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ క్రమంలోనే అధికార పార్టీకి మేలు చేకూర్చడానికే వలంటీర్లు రాజీనామా చేస్తున్నారని పిటిషనర్ తరఫున అడ్వకేట్ వాదించడం జరిగింది.

వలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా రాజీనామా చేసిన వలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే భారీ ఎత్తున వలంటీర్లు తమ విధులకు రాజీనామా సమర్పించి వైసీపీకి ప్రచారం చేస్తున్నారని వాదనలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో హైకోర్టు ఇవ్వబోయే ఆదేశాలు కీలకంగా మారాయి.



Next Story

Most Viewed