రాప్తాడు ఎమ్మెల్యేకు తీవ్ర అసమ్మతి.. ఆ వర్గం నేతలంతా ఒక్కటై..!

by Disha Web Desk 16 |
రాప్తాడు ఎమ్మెల్యేకు తీవ్ర అసమ్మతి.. ఆ వర్గం నేతలంతా ఒక్కటై..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 13న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. వైసీపీ ఒంటరిగా ఎన్నికలు వెళుతోంది. అయితే అభ్యర్థుల కేటాయింపు కొన్ని చోట్ల నిరసనను తీసుకొస్తున్నాయి. కొన్ని నియోజవకర్గాల్లో సిట్టింగులకే మళ్లీ సీటు కేటాయించారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఇతరులను అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో పార్టీల్లో అసంతృప్తుల సెగ తగులుతోంది. అటు అధికార పార్టీకి ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగంగానే అసంతృప్తులు రోడ్డెక్కారు. మరికొన్ని చోట్ల అంతర్గతంగా అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడులో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిను అసమ్మతి వర్గం నేతలు విభేదిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఆయనకే సీటు ఇచ్చి ఇప్పుడు కూడా ఆయనే ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా తమ సామాజిక వర్గానికి సీట్లు కేటాయిస్తారని ఆశించామని, కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రకాశ్ రెడ్డికే సీటు ఇవ్వడాన్ని తప్పు బడుతున్నారు. ప్రతిసారి రెడ్డి సామాజికి వర్గానికే అవకాశం కల్పిస్తే మిగిలిన సామాజిక వర్గాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాప్తాడులో అసమ్మతి నేతంతా సమావేశం నిర్వహించారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి గెలిచిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి మద్దతు ఇవ్వమని తీర్మానం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు సీటుపై పునరాలోచించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాదని ప్రకాశ్ రెడ్డినే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు.


Next Story

Most Viewed