Ap News: రెండు రోజుల పాటు భారీ వర్షాలు..తీవ్ర హెచ్చరిక!

by Disha Web Desk 16 |
Ap News: రెండు రోజుల పాటు భారీ వర్షాలు..తీవ్ర హెచ్చరిక!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రం మొత్తం చల్లబడింది. అంతేకాదు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాబోయే రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం వల్ల రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. రెండు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

అలాగే ఈనెల 27న అంటే మంగళవారం ఏలూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండకపోవడం మంచిదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Next Story

Most Viewed