Bapatla: సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

by Disha Web Desk 16 |
Bapatla: సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా వేటపాలెం సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాపురం, కటారివారిపాలెం మత్య్సకారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రామాపురంలో ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తున్నాడనే నేపథ్యంలో ఆయనను గ్రామం నుంచి వెలి వేశారు. అంతేకాదు గ్రామానికి చెందిన 85 కుటుంబాలు కటారివారి పాలెం తీర ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.

అయితే వీరిని తీర ప్రాంతంలోని 103 గ్రామాల మత్స్యకారులు రామాపురంలో కలిపేందుకు యత్నించారు. ఇందులో భాగంగా కటారివారిపాలెం, రామాపురం మత్య్సకారులతో చర్చించారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే రెండు గ్రామాల మత్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. రెండు గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాగా గతంలో బల్ల వల విషయంలో రామాపురం, కటారివారి పాలెం గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగింది.



Next Story

Most Viewed