పవన్ కల్యాణ్‌కు బుర్ర, బుద్ధి లేదు..తాబేదారుగా పనికొస్తారు: మంత్రి జోగి రమేశ్

by Disha Web Desk 21 |
Jogi Ramesh
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర గృహనిర్మాణశాఖలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణంలో కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. అక్కాచెల్లెమ్మల సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు మంత్రి జోగి రమేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయని...చాలాచోట్ల గృహప్రవేశాలు కూడా జరగుతున్నట్లు వెల్లడించారు. గృహనిర్మాణ శాఖలో ఏం స్కాం జరుగుతుందో చెప్పాలంటూ పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌కు అసలు బుర్ర ఉందా అని నిలదీశారు. కనీస జ్ఞానం, బుద్ధి ఉండి ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ప్రధాని మోడీకి లేఖ రాసేవాడని మంత్రి జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌కు బుద్ధి ఉంటే చంద్రబాబు పాలనపై నిలదీసేవాడని మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు.

ఓపెన్ ఛాలెంజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీలో హక్కే లేదు అని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.చివరకు పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంలో ఆధార్ కార్డు కూడా లేదు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ తాబేదారుగా పనిచేస్తున్నారని తీవ్రస్థాయిలో జోగి రమేశ్ మండిపడ్డారు.అసలు పవన్ కల్యాణ్‌కు జ్ఞానం కూడా లేదు అని విమర్శించారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఏ గడ్డయినా అడ్డదిడ్డంగా తింటారంటూ మండిపడ్డారు. మరోవైపు‘ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దాం. ఇల్లు ఎవరు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారనేదానిపై అడిగి తెలుసుకుందాం’ అందుకు సిద్ధమా అని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేశ్ ఛాలెంజ్ చేశారు.



Next Story

Most Viewed