ఉత్కంఠత రేకెత్తిస్తున్న ఒంగోలు నియోజకవర్గం..? ఎంపీ అభ్యర్థి ఎవరు..?

by Disha Web Desk 3 |
ఉత్కంఠత రేకెత్తిస్తున్న ఒంగోలు నియోజకవర్గం..? ఎంపీ అభ్యర్థి ఎవరు..?
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ప్రతి పార్టీ గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ సర్వే ఆధారంగా అభ్యర్థులను నియమిస్తూ పార్టీ లో మార్పులు చేర్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే పార్టీ లో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులతో కొందరు నేతలు అసహనానికి గురై పార్టీ కి గుడ్ బై కూడా చెప్పేసారు. అయితే ప్రస్తుతం ఒంగోలు నియోజవర్గం వైసీపీకి తలనొప్పిగా మారింది.

ఇప్పటికి నాలుగు జాబితాలను విడుదల చేసి 68 అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన.. ఇప్పటికి ఒంగోలు నియోజకవర్గం నుండి పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఎవరనే అంశం పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాగా ఈ ఒంగోలు నుండి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రానున్న ఎన్నికల బరిలో దించుతూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు టికెట్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇస్తే సహించేది లేదని తేల్చి చెప్పారని సమాచారం.

ఇక ఒంగోలు ఎంపీ సీటుని మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం బాలినేని అభీష్టాన్ని అంగీకరించడం లేదు. దీనితో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో బాలినేని మంతనాలు జరిపారు. కానీ వ్యవహారం మాత్రం కొలిక్కిరాలేదు. ఇక వైసీపీ నుండి ఒంగోలు టికెట్ పై ఆశలు వదులుకున్న మాగుంట ప్రత్యామ్నాయం వైపు అడుగులువేస్తున్నారు.

దీనితో ఏం జరుగుతుందోనని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాగుంటకు సీటు విషయంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీరియస్ గా ఉన్నారు. వైసీపీ అధిష్టానం మాగుంటకు సీటు కేటాయించకపోతే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఇకపై మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు మాగుంటకి సీటు ఇస్తే గెలుపు పక్క అని బాలినేని విశ్వసిస్తున్నారు.. మరో వైపు అధిష్టానం మాగుంటకు సీటు ఇవ్వడం ససేమిరా జరగదు అంటోంది.

వైసీపీ పై ఆశలు వదులుకున్న మాగుంట మరో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. సజ్జల తో బాలినేని మంతనాలు జరిపిన ఫలితం మాత్రం సూన్యంగా కనిపిస్తోంది. దీనితో అసలు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది.? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 5 వ జాబితాను ఫైనల్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.



Next Story

Most Viewed