స్టిక్కర్ సీఎంకు పోటీగా స్టిక్కర్ ఎమ్మెల్యే.. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్

by Dishafeatures2 |
స్టిక్కర్ సీఎంకు పోటీగా స్టిక్కర్ ఎమ్మెల్యే.. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పబ్లిసిటీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏమాత్రం తగ్గడంలేదు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తాము ఫలానా పని చేశామని చెప్పుకోలేక టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులు తాము చేసినట్లు రంగులు వేయించుకుని ప్లెక్సీలు కట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రజల దాహార్తిని తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మాదిరిగానే పత్తికొండ నియోజకవర్గంలో కూడా సుజల మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది అని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి నెలరోజుల పాటు నీళ్లు ఇచ్చి.. తర్వాత నిలిపేశారని మండిపడ్డారు.

ఉప్పర్లపల్లి వద్ద నీటిని శుద్ధిచేసే కేంద్రం ఉందిని, జగన్ రెడ్డి సీఎం అయ్యాక శుద్ధికేంద్రాలకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారని ఆరోపించారు. ‘‘నాలుగేళ్లలో 30 శాతం పనులు చేయలేకపోయారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గంలోని 68 గొలుసుకట్టు చెరువులకు నీరు నింపేందుకు రూ.253 కోట్ల నిధులతో టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అప్పట్లోనే 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పైపులైను పనులు పక్కనబెట్టారు. నాలుగేళ్లుగా పనులు చేయకపోవడంతో పైపులు తుప్పు పట్టిపోతున్నాయి. ఆ పనులు పూర్తైతే భూగర్బ జలాలు పెరిగి వేలాది ఎకరాలకు నీరందడంతో పాటు ప్రజల దాహార్తి తీరేది’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.


Next Story