Viveka Murder Case: సీబీఐ విచారణపై Avinash Reddyసంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Viveka Murder Case: సీబీఐ విచారణపై Avinash Reddyసంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో వ్యక్తి టార్గెట్‌గా విచారణ జరుగుతోందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీబీఐ అధికారులు ఆయనను విచారించారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది క్రితం టీడీపీ నేతలు చేసిన విమర్శనే ఇప్పుడు సీబీఐ కౌంటర్‌లో వేసిందని ఆరోపించారు. వివేకా హత్య జరిగిన రోజు దొరికిన లేఖను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆ లేఖను బయటకు తీసుకురావాలని అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓ వైపు విచారణ జరుగుతుంటే.. తాను దుబాయ్ వెళ్లానని కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. విచారణ సమయంలో బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వంద వరకూ పెంచుతున్నారని అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దూకుడు పెంచిన సీబీఐ

కాగా వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేయడంతో అధికారులు విచారణలో స్పీడు పెంచారు. ఇందులో భాగంగా పలువురుని సీబీఐ అధికారులు ఇప్పటికే విచారించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని సైతం ఇటీవలే విచారించారు. మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో న్యాయవాదులతో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి శుక్రవారం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గత నెలలోనూ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ

అయితే గత నెల 28న తొలిసారి ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్స్‌పై ఆరా తీశారు. సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌కు పదే పదే ఫోన్లు వెళ్లినట్లు గుర్తించారు.



Next Story

Most Viewed