Viveka Case: సీబీఐ విచారణలో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని అడిగిన ప్రశ్నలివే..

by Disha Web Desk 16 |
Viveka Case: సీబీఐ విచారణలో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని అడిగిన ప్రశ్నలివే..
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాగే సీబీఐ విచారణను కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. అవినాశ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందేమోనని ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. ఈ నెల 25 వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని.. అప్పటి వరకూ న్యాయవాది సమక్షంలో లిఖితపూర్వకంగా విచారించాలని, అలాగే ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది.

దీంతో అవినాశ్ రెడ్డిని రెండు రోజులుగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. గురువారం కూడా అవినాశ్ రెడ్డిని 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. వివేకా చనిపోయిన ముందు రోజు పరిస్థితులపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల విషయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి న్యాయవాది వినేవిధంగా ఆయనను 9 గంటల పాటు విచారించారు. అనంతరం మళ్లీ రావాలని చెప్పారు.

మరోవైపు ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి :


Breaking: అవినాశ్‌రెడ్డికి కొనసాగుతున్న సీబీఐ విచారణ

YS Viveka Case : నేడు మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి



Next Story

Most Viewed