Breaking: అవినాశ్‌రెడ్డికి కొనసాగుతున్న సీబీఐ విచారణ

by Disha Web Desk 16 |
Breaking: అవినాశ్‌రెడ్డికి  కొనసాగుతున్న సీబీఐ విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కస్టడీలో భాగంగా ఇవాళ కూడా వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే భాస్కర్ రెడ్డి, ఉదయకుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డిని వేర్వేరుగా విచారించారు.

ఇక ఈ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. వివేకా చనిపోయిన ముందు రోజు పరిస్థితులపై ఆరా తీశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల విషయాలను సైతం సీబీఐ అధికారులు అడిగారు. అయితే ఈ విచారణను వినేందుకు అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదిని కూడా అనుమతి ఇచ్చారు. ఇలా వీరి ముగ్గురిని దాదాపు 7 గంటల పాటు విచారించారు. తాజాగా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. కానీ ఎంపీ అవినాశ్ రెడ్డిని మాత్రం ఇంకా విచారిస్తున్నారు. దీంతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అవినాశ్ రెడ్డి మాత్రం సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనను అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Viveka Case: సీబీఐ విచారణలో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని అడిగిన ప్రశ్నలివే..

Next Story