షర్మిల కాంగ్రెస్ పగ్గాలను చేపట్టడంపై మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 3 |
షర్మిల కాంగ్రెస్ పగ్గాలను చేపట్టడంపై మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు..
X

దిశవెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం అందరికి సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా షర్మిలను పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించి ఆమెను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించి ఏపీ పగ్గాలను పట్టించింది. కాగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసి ఆంధ్రులకు తీరని అన్యాయం చేసిందని.. అలాంటి పార్టీతో వైఎస్ షర్మిల కలవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ తో ఆమె కలవడం ఇక ఆమె విజ్ఞతకే వదిలేయాలని.. అసలు షర్మిల ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారో అర్థం కావడంలేదని పేర్కొన్నారు.. చంద్రబాబు, కాంగ్రెస్ ఏకమై రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ను ఎదుర్కునే సత్తా లేక ప్రతిపక్షాలన్ని ఏకమై వస్తున్నాయని ఎద్దేవ చేశారు. ఎవరు ఎన్నని కుట్రలు పన్నిన చివరికి గెలిచేది వైసీపీనే అని.. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను రానున్న ఎన్నికల్లో మళ్ళీ తణుకు నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా తన విజయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ – జనసేన కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed