అలా చేసే దమ్ముందా.?.. చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్

by Disha Web Desk 16 |
అలా చేసే దమ్ముందా.?.. చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు కోర్టు ఫైళ్ల మాయం కేసులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి క్లీన్ చీట్ వచ్చింది. దీంతో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న ఆయన కూడా అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఎదుటి వాళ్లపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు విశ్వసిస్తారా అని ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు చేసే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుందా అని నిలీదీశారు. తాను సీబీఐ విచారణ చేయించుకున్నానని.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు ఉన్న కేసులపై సీబీఐ విచారణ చేయించుకోగలరా అని ఛాలెంజ్ చేశారు. చాలా కేసుల్లో కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు సీబీఐ విచారణకు వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. అన్ని కేసులపైన కాకపోయినా.. ఏ ఒక్క కేసులోనైనా సీబీఐ విచారణకు సిద్ధము అని చంద్రబాబు చెప్పగలరా అని వ్యాఖ్యానించారు. నాపై చేసిన లోకేశ్ కూడా అసత్యప్రచారాలు చేశారని.. ఈ రోజు సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చిందని, ఇందుకు వాళ్లు ఏం సమాధానం చెబుతారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు, లోకేశ్ వాళ్లకు వాళ్లే చెప్పుకోవాలని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సూచించారు.

తనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అసత్య ప్రచారాలు చేశారని మంత్రి కాకాణి మండిపడ్డారు. ఫైళ్ల మాయం కేసు విషయంలో దోషికన్నా సోమిరెడ్డినే చాలా సార్లు కోర్టుకు తిరిగారని విమర్శించారు. కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సీబీఐ విచారణను తాను ఆనాడే ఆహ్వానించిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తు చేశారు. విచారణలో సీబీఐ అధికారులు అసలు నిజాలు తెలుసుకున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed