Union Minister Chauhan: ఏపీకి హోదాపై ఏమన్నారంటే...

by Disha Web Desk 16 |
Union Minister Chauhan: ఏపీకి హోదాపై ఏమన్నారంటే...
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఏపీకి ప్రత్యేక హోదాకు మించి నిధులిచ్చామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి దేవుసిన్హ చౌహాన్ అన్నారు. కర్నూలులో పర్యటించిన ఆయన ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.42 వేల కోట్ల నిధులిచ్చామని తెలిపారు. గతంలో ఇంత నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. జల జీవ్ మిషన్, ప్రధాన మంత్రి అవాజ్ యోజన వంటి పథకాలతో రాష్ర్టాలకు మేలు చేకూరుతోందని ఆయన వ్యాఖ్యానించారు.రాష్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. గతంలో ఎపుడూ కేంద్రం ఈ స్థాయిలోబడ్జెట్ కేటాయించలేదని దేవుసిన్హ చౌహాన్ తెలిపారు.

అది లేకపోయినా..

ఏపీలో స్పెషల్ స్టేటస్ పేరు లేకపోయినా 48 వేల కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అలాగే రూ.68 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఎయిమ్స్ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. కర్నూలులో డీఆర్డీఓ కు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.


రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాకే..

అయితే కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెన బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని సొంత పార్టీ నేతలే ఉద్యమాలు చేస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తరువాతనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. అప్పర్ భద్రతో రాయలసీమకు అన్యాయం చేకూరుతుందని మరో ప్రశ్న అడుగగా అప్పర్ భద్ర పనులు చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయని, కానీ ఇప్పుడు కేవలం కేటాయించింది బడ్జెట్ మాత్రమేనని దేవుసిన్హ చౌహాన్ సమాధానమిచ్చారు.

Next Story

Most Viewed