Mp Avinash Reddy: 27 తర్వాత విచారణకు హాజరవుతా.. సీబీఐకు మరో లేఖ

by Disha Web Desk 16 |
Mp Avinash Reddy: 27 తర్వాత విచారణకు హాజరవుతా.. సీబీఐకు మరో లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాను తల్లికి అండగా నిలబడాల్సి ఉందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంతో విచారణకు మరికొంత సమయం కావాలని ఈనెల 27 వరకు విచారణకు గడువు ఇవ్వాలని సీబీఐను కోరారు. ఈనెల 27 అనంతరం ఏ రోజు అయినా విచారణకు హాజరవుతానని తెలిపారు. అంతేకాదు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుందని లేఖలో ప్రస్తావించారు.

అయితే ఈ లేఖపై సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్టులో ఉంటేనే విచారిస్తామని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం స్పష్టం చేసింది. మెన్షనింగ్ అధికారి ముందుకుకు వెళ్లాలని జస్టిస్ అనిరుద్ బోస్ ధర్మాసనం సూచించింది. దీంతో మంగళవారం మరోసారి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.

Next Story