Avuku Boat Accident : బోటు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్

by Disha Web Desk 16 |
Avuku Boat Accident :  బోటు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పర్యాటక శాఖకు చెందిన బోటు ఆదివారం బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. సాజిదా, ఆశాబీ, నూర్జహాన్ అనే ముగ్గురు యువతులు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూర్జహాన్ మృతి చెందగా, ఒడ్డుకు చేరుకున్న అసబీ మృతి చెందారు. సోమవారం ఉదయం జలాశయం నుంచి సాజిదా మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. ఇటీవల నీట్‌లో మంచి మార్కులు సాధించిన సాజిదా త్వరలోనే మెడిసిన్‌లో చేరనున్నారు. ఆశాబీ తిరుపతిలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదువుతున్నారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

అయితే బోటులోకి అకస్మాత్తుగా నీరు చేరడంతో బోటు బోల్తా పడిందని పర్యాటకులు చెప్తున్నారు. బోటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో బోటు యజమాని శ్రీనివాసనాయుడు, డ్రైవర్ గేదెల శ్రీనివాస్ సహా ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అవుకు రిజర్వాయర్‌లో బోటు నడిపేందుకు శ్రీనివాసనాయుడుకు పర్యాటక శాఖ అనుమతి ఇచ్చినా ఆయన బోటుకు పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోలేదని తెలుస్తోంది.

Read more:

Chittoor: కుప్పంలో పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు



Next Story

Most Viewed