Breaking: టీడీపీ నేత బోండా ఉమ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల కలకలం

by Disha Web Desk 16 |
Breaking: టీడీపీ నేత బోండా ఉమ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల కలకలం రేగింది. 500 పైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు టీడీపీ నేత బోండా ఉమా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఓట్ల లిస్టును సరి చేయాలని కోరారు. వైసీపీ నేతలే దొంగ ఓట్లను సృష్టించారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 20 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగినట్లు బోండా ఉమ పేర్కొన్నారు.

కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో నకిలీ ఓట్ల కలకలం రేపాయి. చాలా చోట్ల ఇంటి యజమానులకు తెలియకుండా కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. తిరుపతిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారీగా నకిలీ ఓట్లు బయటపడ్డాయి. ఒకే పేరుపై ఏకంగా ఐదారు ఓట్లు ఉండటాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించారు. దీంతో ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో ఓట్లను తనిఖీ చేసి కొత్త జాబితాను విడుదల చేసింది. పాత ఓటర్ల లిస్టులో దాదాపు 10 లక్షల ఓట్లను తొలగించింది. వీటిపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఫేక్ ఓట్లగా పరిగణనలోకి తీసుకుంది.

ఇవి కూడా చదవండి :: Ap News: లోకేశ్‌కు భద్రత కల్పించండి.. అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ



Next Story

Most Viewed