ఇప్పటి దాకా అమెరికా.. ఇక నుంచి విజయవాడ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఇప్పటి దాకా అమెరికా.. ఇక నుంచి విజయవాడ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మరణం లేని మహానేత బాబా సాహెబ్ అంబేద్కర్ అని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన కాసేపట్లో ఆవిష్కరింనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని జగన్ చెప్పారు. ఈ విగ్రహం సామాజిక న్యాయ మహా శిల్పం అని పేర్కొన్నారు. స్టాచ్యు ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని అని చెప్పారు ఇక స్టాచ్యు ఆఫ్ సామాజికి న్యాయం అంటే విజయవాడ గుర్తొస్తుందని తెలిపారు. ఈ అంబేద్కర్ విగ్రహం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల మార్చిన ఘనుడు అంబేద్కర్ అని కొనియాడారు. పోరాటానికి రూపమే అంబేద్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేదలే చదువుకుంటారని.. అటువంటి వాటిని పట్టించుకోకపోవడం కూడా అంటరాని తనమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. పేద విద్యార్థులు తెలుగు మీడియంలో మాత్రమే చదవాలనుకోవడం కూడా వివక్షేనని తెలిపారు. పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలట అని విమర్శించారు. రూపం మార్చుకున్న అంటరాని తనాన్ని పలువురు ఇంకా ప్రోత్సహిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.

Read More..

సీఎం జగన్‌పై సైనిక్ దళ్, సమతా సైనికులు ఆగ్రహం.. కోర్టుకు రావాల్సిందేనంటూ డిమాండ్



Next Story

Most Viewed