డాక్టర్లు తయారయ్యే యూనివర్సిటీకి రౌడీ పేరా? : కాల్వ శ్రీనివాసులు

by Disha Web |
డాక్టర్లు తయారయ్యే యూనివర్సిటీకి రౌడీ పేరా? : కాల్వ శ్రీనివాసులు
X

దిశ, ఏపీ బ్యూరో : డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మార్చుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు శాసన సభ సైతం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును టీడీపీ తప్పుబడుతుంది. ఇప్పటికే బిల్లు ప్రతులను దహనం చేసింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసనలు పెల్లుబిక్కుతున్నాయి. టీడీపీ నేతలు మీడియా సాక్షిగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పబట్టారు.

హెల్త్ యూనివర్శిటీ పెట్టిన సమయంలో రాజశేఖరరెడ్డి ఎక్కడున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. లక్షలాది మంది డాక్టర్లను తయారు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీకి ఒక రౌడీపేరు పెడతారా అని ఆక్షేపించారు. యూనివర్సిటీ కోసం ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని ఆయన పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జగన్ సర్కార్ పునరాలోచన చేయాలని లేని పక్షంలో చరిత్ర క్షమించదని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed