BREAKING: కాకినాడ MP అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

by Disha Web Desk 19 |
BREAKING: కాకినాడ MP అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ పార్లమెంట్ స్థానంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. కాకినాడ ఎంపీ సీటు జనసేన పార్టీదేనని స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. తన కోసం పిఠాపురం అసెంబ్లీ స్థానం త్యాగం చేసిన ఉదయ్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇస్తున్నట్లు పవన్ అనౌన్స్ చేశారు. పొత్తులో భాగంగా తనను ఎంపీ పోటీ చేస్తారా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని బీజేపీ అడిగింది.. ఎమ్మె్ల్యేగానే పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పానన్నారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. పిఠాపురం శక్తి పీఠం సాక్షిగా అడుగుతున్నా.. ఈ సారి నన్ను గెలిపించడని కోరారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థిని వంగ గీత గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారని.. ఇప్పుడు ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొత్తులో భాగంగా మనకు వచ్చిన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేనను గెలిపిస్తే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇందులో ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫిక్స్ చేసిన పవన్.. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఫోకస్ పెట్టారు. అయితే, జనసేనకు కేటాయించిన రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ నుండి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరికి ఇప్పటికే పవన్ మచిలీ పట్నం సీటు కేటాయించారు. దీంతో జనసేన పోటీ చేయబోయే మరో స్థానం ఏంటన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇవాళ పవన్ కల్యాణ్ అధికారికంగా కాకినాడ జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ పోటీ చేయబోయే రెండు పార్లమెంట్ స్థానాలు ఏవి అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.

Read More..

పిఠాపురం నుండే AP దశ మారుస్తా: పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు


Next Story