అందుకే ప్రజాగాయకుడు గద్దర్ పార్టీలకు గుడ్ బై చెప్పి మా పార్టీలో చేరారు: కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
అందుకే ప్రజాగాయకుడు గద్దర్ పార్టీలకు గుడ్ బై చెప్పి మా పార్టీలో చేరారు: కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మంగళగిరిలో నేడు బీసీ డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక వీడియో మీడియాకు విడుదల చేశారు. 40 ఏళ్ల రాజకీయ నాయకుడిగా, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా బీసీలకు న్యాయం చేయాలని ఆయనకు మనసు రాలేదా?, బీసీని ముఖ్యమంత్రి చేయాలని తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని నమ్మిన వారందరూ పవన్ కల్యాణ్ తో సహా.. సర్వనాశనం అవుతారని ఫైర్ అయ్యారు.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని అన్నారు. 60 శాతం బీసీలు సీఎం పదవికి అర్హులు కాదా? అని నిలదీశారు. అందుకే ప్రజా గాయకుడు గద్దర్ ఇలాంటి పార్టీలకు గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారని గుర్తుచేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కూడా టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారని తెలిపారు. బహుజనులందరూ ఏకమవ్వాలని ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తనను విశాఖపట్నం ఎంపీగా చేస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

Read More..

స్వాతంత్య్ర సమరయోధుల సమాధుల స్థలాన్ని విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచాలి

Next Story

Most Viewed