అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా.. జనసేన ఆవిర్భావంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 16 |
అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా.. జనసేన ఆవిర్భావంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీని 150 మందితో ప్రారంభించానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఆవిర్భావం, ఆవశ్యకత, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై పార్టీ శ్రేణులకు ఆయన వివరించారు. జనసేన పార్టీలో ఇప్పుడు మొత్తం 6 లక్షల 50 వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని పవన్ పేర్కొన్నారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ పెట్టిన రోజు ఎవరైతే తనతో ఉన్నారో వారంతా ఇప్పుడు జనసేకు మూలస్తంభాల్లా ఉన్నారని చెప్పారు. ఒక లక్ష్యం కోసం పార్టీ పెట్టానని.. కానీ ఒక్క ఓటమితో శూన్యమనిపించిందన్నారు. చట్టాలు ప్రతి ఒక్కరూ చెప్పారని.. కానీ ఎవరూ పాటించరన్నారు. బద్ధకస్తుడిని కాదని చెప్పేందుకే తాను సినిమాల్లోకి వెళ్లానని పవన్ తెలిపారు. తాను రాజకీయాల్లో వెళ్తే తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అధికారంలో ఉన్న వాళ్లు ఇంత క్రూరత్వంగా ఉంటారా అని అనిపిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అధికారం కోసం రాలేదని, మార్పు కోసమే వచ్చానని చెప్పారు. అన్యాయం జరిగినప్పుడు సగటు మనిషి తిరుగడాలని, ఆ ధైర్యం ఇచ్చేందుకే తాను రాజకీయాల్లో వచ్చానని పవన్ పేర్కొన్నారు.

Read More..

పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై అధికారిక ప్రకటన


Next Story