ఆ ఫిర్యాదులపై చర్యలేవి.. ఏసీబీ అధికారులపై నాదెండ్ల మనోహర్ ఫైర్

by Disha Web Desk 16 |
ఆ ఫిర్యాదులపై చర్యలేవి.. ఏసీబీ అధికారులపై నాదెండ్ల మనోహర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీగా అవినీతి జరగుతుందని.. ఇప్పటి వరకూ ఏసీబీకి 8 లక్షల 3 వేల 16 ఫిర్యాదు వెళ్లాయని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే ఆ ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కింది స్థాయి అధికారులపైనే ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారని, మంత్రులు, వారిపేషీలు, వైసీపీ నాయకులపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని తనకు తాను ముఖ్యమంత్రి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు అవినీతే జరగలేదని ఏసీబీ ఎలా చెబుతుందని నాదెండ్ల నిలదీశారు. ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు కనీసం మీడియా కూడా సమాచారం ఇవ్వడంలేదన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని అహ్మదాబాద్ ఐఐఎం బయటపెట్టిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

Read More..

ప్రజల్లోకి పవన్ ... షెడ్యూల్ ఇదే..!


Next Story

Most Viewed