పొలాల్లో దిష్టిబొమ్మలనైనా నమ్మొచ్చు గానీ చంద్రబాబును నమ్మొద్దు: CM

by Anjali |
పొలాల్లో దిష్టిబొమ్మలనైనా నమ్మొచ్చు గానీ చంద్రబాబును నమ్మొద్దు: CM
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతోన్నా కొద్ది ప్రచారాల జోరు మరింత పెరుగుతోంది. ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలవి డ్రీమ్స్.. వాటిని నిజం చేసే 40 స్కీమ్స్ నావి అని అన్నారు. నేను మంచి చేసి ఉండకపోతే, పోటీకి ఇన్ని తోడేళ్ల గుంపు ఎందుకు అని ప్రశ్నించారు. జగన్‌ను ఓడించాలని వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పేదలు గెలవాలన్నది నా పోరాటం అని చెప్పుకొచ్చారు.

చంద్రముఖిలా రక్తం తాగడమే చంద్రబాబుకు తెలుసు, మేలు చేయడం తెలియదని ఆరోపించారు. ‘దిశయాప్‌’తో రక్షకుడిలా మారానన్నారు. మీరంతా నాకు రక్షకులుగా మారాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో రూ.2.70 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని గొంతెత్తి ప్రశ్నించారు. ఐదేళ్ల బాబు పాలనంతా మోసం, దగా అంటూ మండిపడ్డారు. పొలాల్లో దిష్టిబొమ్మలనైనా నమ్మొచ్చు గానీ చంద్రబాబును నమ్మొద్దని వెల్లడించారు. వ్యక్తుల కలలే కాదు, గ్రామాలు.. రాష్ట్రం కలలు కూడా నెరవేర్చానని జగన్ చెప్పుకొచ్చారు.

Read More...

Ap Politics:ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఎమోషనల్ పోస్ట్..!

Next Story

Most Viewed