Devineni Avinash: ఇంట్లో కీలక డాక్యుమెంట్లు సీజ్

by Disha Web Desk 2 |
Devineni Avinash: ఇంట్లో  కీలక డాక్యుమెంట్లు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 5 టీమ్‌లు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ స్థలం డెవలప్‌మెంట్ విషయంలో దేవినేని అవినాశ్‌తో వంశీరామ్ బిల్డర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు సమాచారం. రెండు హార్డ్ డిస్కులు తీసుకెళ్లి అందులో కొంత సమాచారాన్ని కాపీ చేస్తున్నట్లు చెబుతున్నారు.



Next Story

Most Viewed