Police: విజయవాడలో ముమ్మర తనిఖీలు.. అదే లక్ష్యమా..?

by Indraja |
Police: విజయవాడలో ముమ్మర తనిఖీలు.. అదే లక్ష్యమా..?
X

Big Breaking: విజయవాడ శివారులోని జక్కంపూడి JNURM కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తులను గుర్తించేందుకు ఏసీపీ మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో JNURM కాలనీలో సోదాలు జరిపారు. పాత నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు 6 బృందాలుగా ఏర్పడ్డారు. 6 బృందాల పోలీసులు కాలనీలోని ఐదు బ్లాకుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విదుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Read More..

Breaking: అల్లూరి జిల్లాలో గాలి వాన బీభత్సం

Next Story