నేను రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నా: ఎంపీ మార్గాని భరత్

by Seetharam |
నేను రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నా: ఎంపీ మార్గాని భరత్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతోనే తాను ఈసారి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. వైనాట్ 175 అంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అభ్యర్థులను మారుస్తున్నారని స్పష్టం చేశారు. ఈసారి టికెట్లు దక్కని ఆశావాహులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. సీఎం జగన్ ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తారని.. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులను సైతం కట్టబెట్టబోతున్నట్లు వెల్లడించారు. తనను అసెంబ్లీకి పంపుతున్న తరుణంలో రాజమండ్రి ఎంపీ సీటుపై ఉత్కంఠ నెలకొందన్నారు. ఈసారి కూడా బీసీ అభ్యర్థికే రాజమండ్రి లోక్‌సభ టికెట్ ఇస్తారంటూ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు.

Next Story