ఆ జిల్లాలో భారీ వర్షం

by Dishanational2 |
ఆ జిల్లాలో భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రల ప్రజలకు భానుడి భగ భగల నుంచి ఉపశమనం కలుగుతోంది. తాజాగా ఏపీలో భారీ వర్షం పడుతోంది. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి, ఆత్మకూరు, కోడుమూరు, అల్లూరి జిల్లా పాడేరు, అనంతపురం జిల్లా గుంతకల్లు, గూటి తదితర ప్రాంతాల్లో భారీ వడగళ్ల వర్షం పడుతోంది. అలాగే ప్యాపిలి మండలం ఎస్. రంగాపురంలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే తెలంగాణలో కూడా నిన్న ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నేడు రాష్ట్రంలోని ఆదిలాబాద్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.

Next Story

Most Viewed