Sp Vakul Jindal: బాలుడి సజీవ దహనం కేసులో రాజకీయ కోణం లేదు

by Disha Web Desk 16 |
Sp Vakul Jindal: బాలుడి సజీవ దహనం కేసులో రాజకీయ కోణం లేదు
X

దిశ, దక్షిణ కోస్తా: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలుడి సజీవ దహనం కేసుకు సంబంధించి బాపట్ల పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. అనంతరం రిమాండుకు పంపారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. ఎస్పీ వకుల జిందాల్​ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్​ గౌడ్‌ను అత్యంత పాశవికంగా పెట్రోలు పోసి దహనం చేశారని తెలిపారు. ఘటనకు పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఘటనపై సాంకేతిక, సైంటిఫిక్​ ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. చనిపోయే ముందు బాలుడి డిక్లరేషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించి ఎలాంటి రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు. రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత గొడవల వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్పీ వకూల్‌ జిందాల్‌ వివరించారు.


Next Story