చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించని సినీ నటులు.. అసలు కారణం చెప్పిన పవన్ కల్యాణ్

by Disha Web Desk 16 |
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించని సినీ నటులు.. అసలు కారణం చెప్పిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్లేవరూ స్పందించలేదు. దీంతో సినీ నటులపై విమర్శలు వెళ్లువెల్తుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై సినీ నటులు స్పందించకపోవడానికి గల కారణాలను పవన్ కల్యాణ్ మంగళగిరిలో మీడియాకు వివరించారు. సినీ ఇండస్ట్రీ చాలా సున్నితమైందని, ఎవరు మాట్లాడినా వారిని వైసీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేస్తారమోనన్న భయంతోనే వాళ్లు స్పందించలేదని పవన్ తెలిపారు. సినీ ఇండస్ట్రీలో చాలా పొలిటికల్ గ్రూపులు ఉన్నాయన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా చాలా సందర్భాల్లో కలిసి నటించిన రోజులున్నాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.


Next Story