Margadarsi Case: రామోజీరావుపై కేసు.. సీఐడీకి ఎదురుదెబ్బ

by Disha Web Desk 16 |
Margadarsi Case: రామోజీరావుపై కేసు.. సీఐడీకి ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌కు భారీ ఊరట లభించింది. మార్గదర్శి చిట్ ఫండ్‌లో అక్రమాలు జరిగాయంటూ రామోజీరావు, శైలజాకిరణ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ రామోజీరావు తరపున హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సీఐడీకి పలు ప్రశ్నలు సంధించింది. చిట్ ఫండ్‌కు సంబంధించి తమ పరిధిలో లేకపోయినా కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసుకు, చిట్ ఫండ్‌కు సంబంధమేంటని నిలదీసింది. చిట్ ఫండ్ కేసు అయితే అది చిట్ ఫండ్ చట్టం కిందకు వస్తుంది కదా అని సీఐడీపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపింది. ఇక ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై స్టే విధించింది. 8 వారాలు పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది.

Next Story

Most Viewed