జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

by Disha Web |
జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
X

దిశ, వెబ్‌డెస్క్: కంటి కింద కణితి తొలగించుకొవడానికి ఆసుపత్రికి వెళ్లిన ఐదేళ్ల చిన్నారి.. వైద్యుల నిర్లక్ష్యంతో కన్నుమూసింది.గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది. నగర శివారు అంకిరెడ్డిపాలెనికి చెందిన ఏడుకొండలు, పావని దంపతులు. వీరి కుమార్తె ఆరాధ్య(5) కు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. ఆ కణితిని తొలగించేందుకు తల్లిదండ్రులు ఆరాధ్యను ఈ నెల7న జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆసుపత్రిలో చేర్పించుకుని శాస్త్రచికిత్స చేశారు. తర్వాత కొద్దిసేపటికే బాలిక అపస్మారక స్థితికి చేరుకుని రెండు రోజులైనా స్పృహలోకి రాలేదు.

వైద్యులు నిర్లక్ష్యం వల్లే తమ పాప పరిస్థితి విషమించిందంటూ తల్లిదండ్రులు గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మెరుగైన వైద్యం కోసం ఆరాధ్యను ఈ నెల9న రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అక్కడ 6 రోజులు వెంటిలేటర్‌పై వైద్యం అందించినా ఫలించక ఆరాధ్య కన్ను మూసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప మృతితో తల్లిదండ్రుల రోధన మిన్నంటింది. ఇంతటి శోకంలో ఉన్నా కూడా వారు తమ కుమార్తె కళ్లను దానం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ముగ్గురు వైద్యులతో విచారణ జరిపించి నివేదికను తెప్పించుకుంది. వైద్యం అందించడంలో జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యమేనని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed