AP GOVT: వారి అకౌంట్లోకి రూ.10 వేలు

by Disha Web Desk 16 |
AP GOVT: వారి అకౌంట్లోకి రూ.10 వేలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం నిధులు అకౌంట్లలో వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న లబ్ధిదారులకు వైఎస్సార్ వాహనమిత్ర పథకం అమలు చేయాలని అడుగులు వేస్తున్నారు. అర్హులకు రూ.10 వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేయనున్నారు.

అయితే ఈ నెల 20లోపు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసేవాళ్లు తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు, వాహన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని సీఎం జగన్ తెలిపారు. వాహన మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి డ్రైవర్లకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.


Next Story

Most Viewed