ప్రమాణం చేస్తా.. నగ్న వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ ఛాలెంజ్

by Disha Web Desk 4 |
ప్రమాణం చేస్తా.. నగ్న వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ ఛాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తన నగ్న వీడియోపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది తన వీడియో కాదని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తానన్నారు. తన ఛాలెంజ్ కు చంద్రబాబు సిద్దమా అని ప్రశ్నించారు. తన వీడియో నిజమని నిరూపిస్తే రాజీనామా లేఖను నీ ముఖం మీద విసిరేస్తానని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వీడియో మీద చంద్రబాబు ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు.

చివరికి గెలిచేది తానేనని, చివరికి గెలిచేది ధర్మమేనని మాధవ్ చెప్పారు. తనది ఫేక్ వీడియో అని పోలీసుల విచారణలో తేలిందని, ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ తో టీడీపీ మరోసారి దొరికిపోయిందన్నారు. ఫేక్ వీడియోతో బీసీ ఎంపీని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంత తైతక్కలాట ఆడాల్సిన అవసరం లేదని అన్నారు.


Next Story

Most Viewed