గుడ్ ఫ్రై డే ప్రార్థనలలో మాజీమంత్రి కొడాలి నాని

by Disha Web Desk 10 |
గుడ్ ఫ్రై డే ప్రార్థనలలో మాజీమంత్రి కొడాలి నాని
X

దిశ, డైనమిక్ బ్యూరో : జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే అని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరు భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు జరుపుకోవాలన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని అన్నారు. మనుషుల మధ్య ద్వేషం, కక్షలకు తావు ఇవ్వకూడదని. ప్రేమ, క్షమాగుణాలతో జీవించాలన్న యేసు ప్రభు బోధనలను మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు క్రైస్తవ మత ప్రబోధకులు మాజీమంత్రి కొడాలి నానికి ప్రార్థనలు చేసి దీవించారు. మరోవైపు మచిలీపట్నం ఆర్‌సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలలో యువ నాయకులు పేర్ని కిట్టు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చర్చి నిర్వాహకులు నిర్వహించిన సిలువ యాత్రలో పాల్గొని సిలువ మోసారు.

ఇవి కూడా చదవండి:

Good Friday: ఏసుక్రీస్తు శిలువ మోసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

Kurnool: శ్రీరాముడి దేవాలయ భూములకు వేలం

Next Story

Most Viewed