ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలలో అబ్బాయిలదే హవా!.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం

by Ramesh Goud |
ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలలో అబ్బాయిలదే హవా!.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రీ విడుదల చేశారు. ఈఏపీ సెట్ లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో 1లక్ష 432 మంది దరఖాస్తు చేసుకోగా 91,633 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,54, 750 మంది దరఖాస్తు చేసుకోగా 2, 40,618 మంది హజరయ్యారని అధికారులు తెలియజేశారు. మే 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు రెండు షిఫ్ట్ లలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ పరిక్షలకి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో 91.24 శాతం మంది హాజరు కాగా పరీక్షకు హజరైన వారిలో 89.66 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 94.45 శాతం విద్యార్ధుల హాజరవ్వగా..వారిలో 74.98 శాతం మంది క్వాలిఫై మార్కులు సాధించారు.

ఫలితాల విడుదల అనంతరం బుర్రా వెంకటేషం మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలలో ఈ సంవత్సరం అబ్బాయిలే హవా చూపించారని, టాప్ 10 లో ఒకే అమ్మాయి అది కూడా 10వ ర్యాంక్ సాధించిందని, అలాగే ఇంజనీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్ధులదే మొదటి ర్యాంకు సాధించారని అన్నారు. ఇక ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లోనే భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని, ముందే సీట్లు భర్తీ చేసుకున్నట్టు పిర్యాదులు వస్తే కాలేజ్ లపై చర్యలు తీసుకుంటామని చెబుతూ.. శ్రీనిధి, గురునానక్ కాలేజ్ ల (ప్రైవేట్ వర్సిటీ) పై సీరియస్ చర్యలు ఉంటాయని తెలిపారు.

తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ఎప్ సెట్ కి గత పదేళ్లలో ఎన్నడు లేనంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని, పరీక్షలు ప్రశాంత వాతవరణంలో నిర్వహించినట్లు తెలిపారు. అలాగే గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాయగా.. ఈ సారి ఒక్కో షిఫ్ట్ కు 50 వేల మంది రాశారని అన్నారు. ఇక ఫలితాలపై విద్యార్ధులు ఆందోళన చెందవద్దని సూచించారు.

Next Story

Most Viewed