విద్యుత్ కోతలు నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు రైతు నిరసన

by Disha Web Desk 18 |
విద్యుత్ కోతలు నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు రైతు నిరసన
X

దిశ,శ్రీకాళహస్తి:ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యుత్ రాకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి.అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో ఒక రైతు గురువారం మండల కేంద్రమైన ఏర్పేడులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.గాలి గుణశేఖర్ నాయుడు అనే రైతు నెలకు లక్ష రూపాయల విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. పంటలు పెట్టినప్పటి నుంచి విద్యుత్ లేక నీటిని పంట పొలాలకు పంపడం లేదు దీంతో ఎండిపోతున్నాయి. ట్రాన్స్కో డిఈకి, ఏఈకి ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్తు రాకపోవడంతో ఆయన గురువారం ఎండలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

స్థానిక రైతులు కూడా ఆయనకు మద్దతు పలికారు. అయితే రైతు నిరసన విషయం తెలిసి కూడా ట్రాన్స్కో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు నాలుగు గంటలు కూడా విద్యుత్తు రావడం లేదని దీనివల్ల పెట్టిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లలో నీళ్లు ఉన్నా వాటిని ఉపయోగించుకునే అవకాశం లేకపోవడం వల్ల పంటలు ఎండుతున్నాయి.అప్పులు చేసి పెట్టిన పంటలు ఎండిపోతే మరింత ఇబ్బందులకు గురవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story