Breaking: తిరువూరులో భారీగా డబ్బు.. కౌన్సిలర్ భర్తపై కేసు

by Disha Web Desk 16 |
Breaking: తిరువూరులో భారీగా డబ్బు.. కౌన్సిలర్ భర్తపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కౌన్సిలర్ భర్త ఇంట్లో సోదాలు చేశారు. రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కౌన్సిలర్ భర్త శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఓటర్లకు నగదు, మద్యం, బంగారం, వెండి, చీరలు, గిఫ్టులు పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించొద్దని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed