పలు గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ అవగాహన సదస్సులు

by Dishafeatures2 |
పలు గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ అవగాహన సదస్సులు
X

దిశ, జగ్గంపేట: గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ నెల 14వ తేదీన ఆయుష్మాన్ భారత్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.పి.సరిత వెల్లడించారు. మంగళవారం జగ్గంపేట గ్రామ సచివాలయం -1 నందు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ తో ఆరోగ్యం( Cycle for Health) అనే కార్యక్రమం ఫై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ బండారు రాజా, జెడ్పీటీసీ బిందు మాధవి రఘురాం ముఖ్య అతిదులుగా హాజరయ్యారు .

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డా.పి.సరిత మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్యానికి సంబందించిన ఒక్కో అంశంఫై ప్రజలకు అవగాహన కల్గించడం జరుగుతుందన్నారు. అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లలో కార్యక్రమాలు చేపడతామని, ఈ రోజు సైకిల్ తో ఆరోగ్యం అనే అంశం ఫై అవగాహన కల్గించామని తెలిపారు. ఉప్సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ.. సైకిల్ వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకొవాలన్నారు . విద్యార్థులంతా దీని ఫై అవగాహన పెంచుకుని పాటించాలని కోరారు. పిబ్రవరి నెలలో కాన్సర్ వ్యాధి ఫై అవగాహన కార్యక్రమం కాబట్టి ఆరోగ్య సిబ్బంది కాన్సర్ వ్యాధి లక్షణాలను ప్రజలకు తెలియ జేసి, తొలి దశలోనే కాన్సర్ ను గుర్తించి చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రోజు 30 నిమషాలు సైకిల్ వ్యాయామం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పారు.

రఘురాం మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2018లో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ రాష్ట్రం లో గొప్పగా కొనసాగుతోదందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తం గా నిర్వహించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా జరిగే అన్ని ఆరోగ్య కార్యక్రమాలఫై ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్గించి, ఈ కార్యక్రమాన్ని వారు వినియోగించుకునేలా చెయ్యాలని కోరారు. అనంతరం స్కూల్ విద్యార్థుల తో కలసి ర్యాలి నిర్వహించారు. రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో సైకిల్ తో ఆరోగ్యం( Cycle for Health) కార్యక్రమానికి రాజపూడి గ్రామ సర్పంచ్ గౌ.శ్రీ బూసాల విష్ణు మూర్తి, మెడికల్ ఆఫీసర్ .డా.గౌతమి, గ్రామస్తులు ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల విద్యార్దిని, విద్యార్ధులు , ఉపాధ్యాయులు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story