AP Elections 2024: బీజేపీ పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..

by Disha Web Desk 3 |
AP Elections 2024: బీజేపీ పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డిస్క్: ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన విషయం అందరికి సుపరిచితమే. అయితే ఎన్నికల సమయంలో వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కూడా పోటీ నుండి విరమించుకుని కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. దీనితో వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకోవడమే కాకుండా ఆమెకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను కూడా అప్పగించనున్నారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు సంసిద్ధం అవుతూ ఈ రోజు సీపీఐ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఈ రోజు నిర్వహించిన సీపీఐ సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. జగన్ న్ని భయపెట్టేందుకే షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ లోకి తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

అలానే ఇక తెలంగాణ లో కేసీఆర్ సర్కారు లేనట్లే అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్ పరిపాలనతో విసిగిపోయారని.. జగన్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కాగా రాజకీయాలు రెప్పపాటు కాలంలో మారిపోతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా బీజేపీ దేవుడిని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించాలని చూస్తోంది అని ఆరోపించిన అయన.. ఎన్నికల సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై హడావిడి చేయడం.. జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రారంబించాలనుకోవడం కేవలం ఓట్ల కోసమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ పైన దాడి జరిగితే బీజేపీ జవాబు ఎందుకు చెప్పలేకపోతోంది..? అని ప్రశించారు. ఇవన్నీ బీజేపీ కుట్రల్లో భాగమేనని మండిపడ్డారు. బీజేపీ పనిచేస్తుంది ప్రజల కోసం కాదని.. అదానీ కోసం అని.. ప్రస్తుతం అదానీని రక్షించే పనిలో బీజేపీ బిజీగా ఉందన్నారు. ఇండియా కూటమిని బలోపితం చేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed