Ap News: నేటితో ముగిసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

by Disha Web Desk 18 |
Ap News: నేటితో ముగిసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో చివరి సిద్ధం సభతో ఈ యాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లాలోని అక్కివలస నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఇవాళ ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన కొనసాగింది. కాగా అక్కివలస నుంచి మొదలైన బస్సు యాత్ర చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా కోటబొమ్మాళి వరకు బస్సు యాత్ర నిర్వహించారు.

మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు అక్కవరంలో జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. కాగా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మరోవైపు యాత్ర ముగిసిన తర్వాత సీఎం జగన్ విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం జగన్ మొత్తం 22 రోజుల పాటు 86 నియోజకవర్గాల మీదుగా 2100 కి.మీ మేర యాత్ర సాగింది. 16 బహిరంగ సభలు, 9 రోడ్ షోలు , 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాగా రేపు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.



Next Story

Most Viewed