‘వయస్సులో నేను చాలా చిన్నోడిని’.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
‘వయస్సులో నేను చాలా చిన్నోడిని’.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో గురువారం సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు.. నా కంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని చంద్రబాబును ఉద్దేశిస్తూ అన్నారు.

వయస్సులో నేను చాలా చిన్నోడినని.. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. వయస్సులో చిన్నోడినైనా రాష్ట్రకోసం పని చేశానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు బాగుపడ్డాయి.. వైద్య రంగం మైరుగైందని చెప్పారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎప్పుడైనా చంద్రబాబు హయాంలో కనబడ్డాయా అని అన్నారు. గత పాలన, మన పాలన మధ్య మార్పును గమనించాలని కోరారు. మార్పు గమనించి సరైన వ్యక్తికి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేది మన తలరాతలు మార్చే ఎన్నిక.. చేసిన మంచిని చూసి ఓటు వేయాలని అడుగుతున్నానన్నారు.


Next Story