CM Jagan: ఏప్రిల్3న కీలక సమావేశం.. నేతల్లో సర్వత్రా ఉత్కంఠ

by Disha Web Desk 16 |
CM Jagan: ఏప్రిల్3న కీలక సమావేశం.. నేతల్లో సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం జగన్ పార్టీపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యారు. 100 రోజుల క్రితం నుంచే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన సీఎంను ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉక్కిరిబిక్కిరి పెడుతున్నాయి. అటు సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయడం మింగుడుపడనీయటం లేదు. ఈ పరిణామాలపై సీఎం జగన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న పార్టీ ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పని తీరుపై తొలుత సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. అనంతరం పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిర్ణయాలను కుండబద్దలు కొడతారని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఫెయిల్ అవుతున్న ఎమ్మెల్యేలకు చివరి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అప్పటికీ పరిస్థితి మారకపోతే ఇక తప్పించి టికెట్ వేరొకరికి ఇచ్చేందుకు ఇప్పటికీ జాబితా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్3న జరిగే సమావేశం అత్యంత కీలకం కావడంతో ఆ సమావేశంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed