కొడుకుని వైసీపీలోకి పంపి ఏంటి ఈ డ్రామాలు..జనసేన నాయకులు

by Disha Web Desk 18 |
కొడుకుని వైసీపీలోకి పంపి ఏంటి ఈ డ్రామాలు..జనసేన నాయకులు
X

దిశ ప్రతినిధి, తిరుపతి: హరి రామ జోగయ్య తీరు నచ్చకే తిరుపతి కాపు సంక్షేమ సేన నేతలు రాజీనామ చేశారు. సొంత కుమారుడు వైసీపీలో చెరితే ఎందుకు ఖండించలేదని, పవన్ కళ్యాణ్ కు మాత్రం సలహాలు ఇస్తారు, లెటర్లు రాస్తారు.కానీ కొడుకుకు ఎందుకు చెప్పుకోలేక పోయారని ప్రశ్నించినందుకు గాను..తిరుపతిలో కాపు సంక్షేమ సేన నాయకులు హిమవంత్, కొండా రాజమోహన్, వంశీ లను సోమవారం వారి పదవుల నుంచి హరి రామ జోగయ్య సస్పెండ్ చేశారు. జోగయ్య కు, కాపు సంక్షేమ సేన లోని కొందరికి జవాబుగా.. సస్పెండ్ చేయబడ్డ కొండ రాజమోహన్, వంశీ, హిమవంత్ లు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముఖంగా మాట్లాడుతూ.. మీ కుమారుడు వైసీపీలోకి వెళ్లిన వెంటనే కాపు సంక్షేమ సేన లేదని, మాకు ఉండేది ఒక్క జనసేననే అని అర్థమైందన్నారు.

జనసేనకు సపోర్ట్ అనే ఇన్ని రోజులు మీ కాపు సంక్షేమ సేనలో కొనసాగామని, బలిజ, కాపు కులాలవారు అందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు, ఉంటామని వారు స్పష్టం చేశారు. మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని, మేమే ఈ లెటర్ ను చించి బయటకు వెళ్లడం జరుగుతుందని మీడియా ముఖంగా ఆ లెటర్ ను చించిపడేశారు. మాది జనసేన బ్లడ్ అని, మీలా మీ కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ కాదని, కొడుకుని వైసీపీలోకి పంపి ఈ డ్రామాలు ఏంటని, మీ సొంత స్వలాభం కోసం పార్టీలు మారి, మీకొడుకు జనసేన అధినేత పై అబాండాలు వేయటం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. సీటు కావాలంటే ఏ పార్టీకైనా వెళ్లవచ్చని పవన్ కళ్యాణ్ ని విమర్శించిన తీరును తప్పు పట్టారు.

కాపు సంక్షేమసేనలో ఉండి ఎన్నడూ సొంత ఖర్చుతో శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక పూలమాల కూడా వేయని వ్యక్తీ కూడా ఈరోజు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన మమ్మలను విమర్శించడం తగదు అన్నారు. ఇతర కులాల వాళ్ళు గౌరవిస్తామని ఎప్పుడు అన్ని కుల సంఘాలతోనే కలిసి వెళుతున్నామని, శతకోటి బలిజ కుల సంఘాలలో.. మీది ఒక కుల సంఘం అని, జనసేన ను వ్యతిరేకించే ఈ కుల సంఘం మాకు వద్దని చెప్పారు.పవన్ కళ్యాణ్ తోనే మా ప్రయాణమని, కుల సంఘాల పేరుతో ఎవరైనా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తీవ్రంగా హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో పురుషోత్తం, ఆది, గుట్టా నాగరాజు రాయల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed