టీడీపీలోకి వలసల జోరు..వైసీపీని వీడిన 100 కుటుంబాలు

by Jakkula Mamatha |
టీడీపీలోకి వలసల జోరు..వైసీపీని వీడిన 100 కుటుంబాలు
X

దిశ, చంద్రగిరి:చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలం తాడేపల్లి క్రాస్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పాడిపేట పంచాయతీ పాడిపేట గ్రామం, పాడిపేట హరిజనవాడ మరియు గోవింద పురానికి చెందిన 100 వైసీపీ సానుభూతి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు, పులివర్తి నాని పోరాట పటిమ మమ్మల్ని వైసీపీని వీడేలా చేశాయని కొత్తగా పార్టీలో చేరిన వారు అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చడం లేదని, టీడీపీ తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరామన్నారు. పులివర్తి నాని విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం పులివర్తి నాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Next Story

Most Viewed