Tirupati: చిత్తూరు జిల్లాలో మళ్లీ కరోనా భయం.. బిగ్ అలర్ట్ తప్పదంటున్న వైద్యులు

by Disha Web Desk 16 |
Tirupati: చిత్తూరు జిల్లాలో మళ్లీ కరోనా భయం..  బిగ్ అలర్ట్ తప్పదంటున్న వైద్యులు
X

దిశ, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాను మళ్లీ కోవిడ్ భయం ప్రజలను వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ఉమ్మడి జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. జనవరి నెల నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో నలుగురికి నయం కావడంతో ఇంటికి వెళ్లారు. రెండు రోజుల క్రితం రెండు కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో తిరుమల పుణ్యక్షేత్రం ఉండటంతో దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. వారికి కరోనా టెస్టులు చేసేందుకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆర్టీపీసీఆర్ కౌంటర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంచారు. బూస్టర్ డోస్‌లు వేసుకున్నప్పటికీ మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం కరోనా నివారణ జాగ్రత్తలు సిద్ధం చేసింది.

చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ 95% పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తుందని. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే ఉధృతిని అడ్డుకోవచ్చని చెప్పారు. ‘ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం, శానిటైజర్ వాడకం తప్పనిసరిగా చేయాలి. అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయాలి. కోవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌లు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండటంతో పాటు, నిర్లక్ష్యంగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేకుండా వ్యాక్సిన్ తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండటం ఎంతో కీలకం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’ అని అధికారులు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed