తిరుమలలో నో రష్.. 3 గంటలలోనే శ్రీవారి దర్శనం

by Dishafeatures2 |
తిరుమలలో నో రష్.. 3 గంటలలోనే  శ్రీవారి దర్శనం
X

దిశ, తిరుమల: వర్షాల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, క్యూ లైన్లలోకి వెళ్లిన భక్తులు నేరుగా స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. టోకెన్ లేకుండా వెళ్లిన భక్తులు కూడా కేవలం 3గంటల్లోనే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారు 2 గంటల్లోనే దర్శన భాగ్యం లభిస్తున్నది. కాగా,నిన్న తిరుమల వెంకన్నను 69,143 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,145 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.38 కోట్ల ఆదాయం లభించింది.


Next Story